సింగిల్ పేమెంట్ : BMW కారుకి రూ.లక్ష చలానాలు కట్టాడు

hyderabad-traffic-police-BMWరోడ్డెక్కితే దూసుకెళ్తాడు.. లిమిట్ ఉన్నా స్పీడ్ తగ్గడు.. జరిమానాలు వేసినా పట్టించుకోలేదు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆ కారుపై 70 చలానాలు ఉన్నాయి. వీటిలో మూడు ఓవర్ స్పీడ్ పెనాల్టీలు. ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీ సైబరాబాద్ లిమిట్స్ లో ఒక్క కారు చేసిన అరాచకం. ఆ కారు BMW. కోట్లు పోసి కొన్న కారులో తన దర్పం చూపించాడు హైదరాబాద్ సిటీ రోడ్లపై. ఎప్పటికప్పుడు జరిమానాలు విధిస్తున్నా మార్పు రాలేదు. డోంట్ కేర్ అన్నాడు. అన్నీ కలిపి 70 చలానాలు. ఆ కారు నెంబర్ AP 28 DX 6363. చక్రధర్ పేరుపై ఉంది.

ఎన్నిసార్లు హెచ్చరించినా మారకపోవటంతో.. జరిమానాలు కట్టకపోవటంతో ఆ లిస్ట్ ను కోర్టుకి సమర్పించింది ట్రాఫిక్ పోలీస్ శాఖ. ఇందులో ఈ సార్ గారి పేరు కూడా ఉంది. 70 చలానాలు విధించినా మారని వ్యక్తి.. కోర్టు కేసు.. జైలు శిక్ష అనగానే వణికిపోయాడు. అంతే జనవరి 20వ తేదీన అన్ని చలానాలకి కలిపి అక్షరాల లక్షా 04వేల 400 రూపాయలను ఆన్ లైన్ ద్వారా చెల్లించాడు. కోర్టు మెట్లు ఎక్కటం.. శిక్ష నుంచి తప్పించుకోవటం కోసం ఆన్ లైన్ ద్వారానే.. సింగిల్ పేమెంట్ లో జరిమానాలు అన్నీ కట్టేసినట్లు తెలిపారు పోలీసులు. వాస్తవంగా అయితే ఇన్ని చలానాలు పడిన తర్వాత.. అందులోను ఓవర్ స్పీడ్ పై ఉన్న చలానాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. యాక్సిడెంట్స్ కారణం అవుతున్నారని. పదే పదే ఓవర్ స్పీడ్ చలానాలు పడిన వారిని పిలిపించి హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy