సికింద్రాబాద్‌లో కారు బీభత్సం

CARసికింద్రాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో ఓ కారు బీభత్సం సృస్టించింది. మారేడ్‌పల్లి ప్రాంతంలో రహదారి పక్కనే ఉన్న ఇంటి ప్రహారీ గోడను ఢీకొంది. దీంతో ప్రహారీ గోడ ధ్వంసమైంది. ఈ ఘటనలో కారులో ఓ యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడు మందు కొట్టి కారు వేగంగా నడిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినకారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. కారును పరిశీలించిన పోలీసులు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని పోలీసులు చెప్పారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy