సికింద్రాబాద్ లో బస్సు బీభత్సం…ఒకరి మృతి

సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్యాట్నీ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న బస్సు ప్రశాంత్ థియేటర్ దగ్గరకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని…ఎదురుగా వస్తున్న ఆటో, బైక్ ల పైకి దూస్కెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా…మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆలేరు ప్రాంతానికి చెందిన దానమ్మ, బోయిన్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌, మేడ్చల్‌కు చెందిన శ్రీనుగా గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకులు ఫెయిల్ కావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు…కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy