సిక్కింలో తొలి ఎయిర్ పోర్టు: ప్రారంభించిన ప్రధాని

సిక్కింలోని గ్యాంగ్ టక్ సమీపంలోని పాక్యంగ్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ( సెప్టెంబర్-24) లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలో…అత్యంత సంక్లిష్టతల మధ్య 9 ఏళ్లు కష్టపడి నిర్మించారు. రూ.605 కోట్ల ఖర్చుతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి ఢిల్లీ, గ్యాంగ్‌టక్‌, కోల్‌కతా, గౌహతిలకు ఇక్కడి నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. కొండచరియలున్న ఈ ఈశాన్య రాష్ట్రంలో ఇదే మొదటి ఎయిర్ పోర్టు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy