సిటీ కాలేజ్ కు కొత్త హంగులు

citహైదరాబాద్ ప్రభుత్వ సిటీ కాలేజ్ పురాతన భవనం కొత్త హంగులతో రెడి కానుంది. ఈ సిటీ కాలేజ్ భవనాన్ని హెరిటేజ్ భవనంగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియన్ కింద కాలేజ్ బిల్డింగ్ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన మరమ్మతులతో పాటు ప్రహారి గోడ నిర్మాణం, ఆడిటోరియం ఆప్ గ్రేడ్ చేస్తామంటున్నారు కాలేజ్ ప్రిన్సిపల్. మరమ్మతులతో మరో 70 ఏళ్లు బిల్డింగ్ క్షేమంగా ఉంటుందని చెబుతున్నారు

ఓల్డ్ సిటీలోని హైకోర్ట్ దగ్గరలో 1929లో నిర్మించిన ఈ సిటీ కాలేజ్ భవనంలో 76 గదులున్నాయి. ఈ బిల్డింగ్ లో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయెషన్ కాలేజ్ కొనసాగుతున్నాయి. రెండు వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. విద్యార్థులకు టాయిలెట్స్… తాగునీటి సమస్యను యుజిసీ గ్రాంట్ నిధులతో సాల్వ్ చేయనున్నారు. నిరుపేద విద్యార్థులకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు స్టాఫ్.

హైదరాబాద్ సిటీ కాలేజ్ లో చదివితే భవిష్యత్ లో ఎక్కడైన బతికే విధంగా స్టూడెంట్స్ ను ట్రైనప్ చేస్తుంది ప్రభుత్వం. ఈ కాలేజ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ లో ప్రతి స్టూడెంట్ కు పర్సనాల్టీ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ , ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుతున్నారు. విద్యార్థులకు వృత్తి కోర్సుల్లో గాజులు.. పేపరు బ్యాగ్స్..  చెవి కమ్మల తయారీలో శిక్షణ ఇస్తున్నారు..

సిటీ కాలేజ్ లో చదవడంతో తమ భవిష్యత్ కు మార్గం ఏర్పాడుతుందంటున్నారు విద్యార్థులు. చదువుతో పాటు బతకడానికి ఉపాధి మార్గాలను చూపుతున్నరంటున్నారు స్టూడెంట్స్.

నిజాం నవాబు మీర్ ఉష్మాన్ అలీఖాన్ నిర్మాణం చేసిన ఈ సిటీ కాలేజ్ భవనానికి తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతోమంది రాజకీయ నేతలు చదవడంతో పాటు… బాలివుడ్, టాలివుడ్  సినిమా లొకేషన్ గా కూడా ఉపయోగపడుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy