సిటీ శివార్లకు ధర్నా చౌక్

dharna-chowkగత 16 ఏళ్లుగా కర్షక కార్మిక, మహిళ, విద్యార్థి, వివిధ సంఘాల డిమాండ్ ల సాధనకు కార్యక్షేత్రంగా ఉన్న ఇందిరాపార్క్ ధర్నా చౌక్.. ఇప్పుడు మూగబోనుంది. ఇకపై అక్కడ నినాదాలు వినిపించవు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ సమస్య నేపథ్యంలో ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 30 ఎకరాల్లో ప్రత్యామ్నాయ ప్రదేశం గుర్తించాలని అధికారులను ఆదేశించింది. మియాపూర్, ఉప్పల్, నాగోల్, రాజేంద్రనగర్‌లలో స్థలాన్వేషణ కొనసాగిస్తున్నారు పోలీసులు. అన్ని సదుపాయాలతో నిరసనలు జరుపుకునేలా ఏర్పాట్లు చూడాలని సూచించింది ప్రభుత్వం.

ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరం వరకు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఆందోళనలు జరిగేవి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్కడే నిరసన తెలిపేవారు. అయితే  చంద్రబాబు హయాంలో సచివాలయం వద్ద ధర్నాలు, ఆందోళనలు చేయకూడదంటూ ఆదేశించి మరోచోటుకు తరలించాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో ఇందిరాపార్క్, ఎన్టీఆర్‌ స్టేడియం పరిసరాల్లో తమ అనుమతితో ధర్నాలు, నిరసనలు చేసుకోవచ్చని అప్పటి కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాపార్క్‌–డీబీఆర్‌ మిల్స్‌ రోడ్‌ను ధర్నా చౌక్‌గా ఏర్పాటు చేశారు. ఉద్యమాలు, నిరసనలు అక్కడే జరిగేవి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా కొనసాగుతున్న ధర్నా చౌక్‌ ప్రస్థానం అతి త్వరలో ఇందిరా పార్క్‌ వద్ద ముగియనుంది.

అయితే ఇక ఇందిరా పార్క్‌ నుంచి ధర్నా చౌక్‌ను తరలిస్తే ఎక్కడ పెడతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మియాపూర్, నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, సాగర్‌ రోడ్, రాజేంద్రనగర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 25 నుంచి 30 ఎకరాల్లో ధర్నా చౌక్‌ను విశాలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy