సిట్ ముందుకు ఇవాళ నవదీప్

navdeepడ్రగ్స్ కేసు విచారణ ఇంకింత స్పీడప్ చేశారు సిట్ అధికారులు.  డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సిట్ ముందు ఇవాళ హాజరు కానున్నాడు సినీ నటుడు నవదీప్. హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్‌ లో నేడు ఉదయం పదిన్నరకు నవదీప్ తో విచారణ ప్రారంభమవుతుంది. మిగతా నలుగురిలాగే నవదీప్‌ ను కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశముంది. నవదీప్ నడుపుతున్న పబ్‌ కు సిట్ నోటీస్ ఇవ్వడంతో అతన్ని లోతుగా విచారించనున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యాం కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ లతో విచారణ పూర్తి చేసింది సిట్. ఇప్పటికే కెమెరామెన్ శ్యామ్ కె.నాయుడు విచారణ త్వరగా పూర్తిచేసిన అధికారులు.. దర్శకుడు పూరి జగన్నాథ్ ను 11 గంటలు, సుబ్బరాజును 12 గంటలు విచారించారు. నటుడు తరుణ్ ను ఏకంగా 13 గంటలపాటు విచారించారు. వీళ్ల రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు తీసుకొని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

నవదీప్ కు డ్రగ్స్ రాకెట్ తో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. అదీగాక నవదీప్ స్వయంగా పలు పబ్బుల్ల పార్ట్ నర్ గా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో పబ్బుల్లో డ్రగ్స్ సరఫరాపై ప్రశ్నలు తయారుచేసినట్టు తెలుస్తుంది. నవదీప్ కు డ్రగ్స్ సప్లయర్స్ కెల్విన్, జీషన్ లతో సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో డ్రగ్స్ రాకెట్ తో ఉన్న సంబంధాలు, పబ్బుల్లో డ్రగ్స్ ఏవిధంగా సరఫరా చేస్తున్నారు.. డ్రగ్స్ తెచ్చేది ఎవరు.. కెల్విన్, జీషన్ తో సంబంధాలేంటనే విషయాలను రాబట్టే చాన్సుంది. ఇక గోవా నుంచి వచ్చే ఫోన్లు, అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా మీద నవదీప్ ను ప్రశ్నించనుంది సిట్. ఇప్పటికే అరెస్టయిన ఈవెంట్ మేనేజర్ బ్రిండన్ బేర్ తో పరిచయాలపై వివరాలు రాబట్టనుంది సిట్.

ఇగ నవదీప్ నగర శివార్లలో ఈవెంట్ మేనేజర్ బ్రిండన్ బేర్ తో కలిసి నవదీప్ చాలా ఈవెంట్లు చేసేవాడనే సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ముఠాల కీలక నిందితుడు కెల్విన్, బ్రిండన్ బేర్ కాల్ డాటా పరిశీలించిన సిట్ అధికారులకు నవదీప్ తన పర్సనల్ నెంబర్ నుంచి చాలాసార్లు వారితో మాట్లాడినట్టు తెలిసింది. ఈ ఇద్దరితోని దిగిన ఫొటోలు, కొన్ని వీడియోలమీద అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో టాస్క్ ఫోర్స్ కు పట్టుబడిన ఇద్దరు నైజేరియన్లు కూడా నవదీప్ పేరు చెప్పినట్లు సమాచారం. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 40 నుంచి 50 ప్రశ్నలను సిట్ తయ్యారు చేసినట్టు తెలుస్తోంది.

 

ఇప్పటికే నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 బార్లకు, 16 పబ్బులకు సిట్ అధికారులు నోటిసులిచ్చారు. ఈ పబ్బుల్లోనే డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. వీకెండ్స్ లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన ఎఫ్- క్లబ్ లైసన్స్ రద్దుచేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో పాటు నవదీప్ దిగా చెబుతున్న బీపీఎం పబ్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు. సర్కారు కూడా డ్రగ్స్ రాకెట్ విషయంలో సీరియస్ గా ఉండటంతో…. తొందర్లనే తెలంగాణ యాంటీ నార్కొటిక్ సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టాన్ని ఇంకింత కఠినతరం చేయాలన్న సీఎం ఆదేశాలతోని ఆ వైపు దృష్టిపెట్టారు అధికారులు.

 

 

 

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy