సిట్ ముందుకు రానున్న సినిమా సెలబ్రిటీలు!

actorsడ్రగ్స్ వ్యవహారంపై సిట్ విచారణను వేగవంతం చేస్తున్నారు అధికారులు. టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించి డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్నది. డ్రగ్స్‌ కేసుతో సంబంధమున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరే సిట్‌ ముందుకు రాబోతున్నారు. సిట్‌ అడుగబోయే కఠినమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉండి.. డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులకు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటికే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు  ఈ నెల 19 నుంచి సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.

ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, 20న హీరోయిన్‌ ఛార్మీ, 21న నటి మొమైత్‌ ఖాన్‌, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామ్యాన్‌ శ్యాం కే నాయుడు సిట్‌ ఎదుట హాజరుకాబోతున్నారు. ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా అయిన ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్‌ను ఫేస్‌ చేయబోతున్నాడు. ఈ నెల 25న ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను, 26న హీరో నవదీప్‌, 27న హీరో తరుణ్‌, 28న యువ హీరోలు తనీష్‌, నందులను సిట్‌ విచారించనుంది. పేరుమోసిన డ్రగ్స్‌ సరఫరాదారుడు కెల్విన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy