సిద్దిపేట ప్రభుత్వ స్కూల్ కు ISO గుర్తింపు

isoఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయంగా కంపెనీలు, ఉత్పత్తుల ప్రమాణాలను బట్టి గుర్తింపునిచ్చే సంస్థ. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ… మనదేశంలో నాలుగు స్కూళ్లకు మాత్రమే తన గుర్తింపునిచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒకే ఒక స్కూలుండగా… అది మనరాష్ట్రంలోనే ఉండడం విశేషం.

ఇది సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల ప్రభుత్వ పాఠశాల. రెండొందల మంది విద్యార్దులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ స్కూల్ ఇప్పుడు అరుదైన ఘనతను సాధించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు రాముని పట్ల గవర్నమెంట్ స్కూల్ కు దక్కింది. స్విట్జర్లాండ్ లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ISO ఇప్పటిదాకా భారదేశంలో మూడు స్కూళ్లకు గుర్తింపు ఇవ్వగా… రామునిపట్ల నాలుగోది.

ఉత్తమ ప్రమాణాలను పరిశీలించి సంస్థలను సర్టిఫైడ్  చేస్తుంది ISO. ఎక్కువగా పరిశ్రమలు, ఉత్పత్తులకు ISO సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే కొన్ని ఇనిస్టిట్యూషన్స్ కి కూడా ISO గుర్తింపు ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రామునిపట్ల స్కూలే… ISO గుర్తింపు పొందిన మొదటి సంస్థ. మొత్తం 40 అంశాలను పరిగణలోకి తీసుకుని స్కూల్ కు సర్టిఫికెట్ ఇచ్చింది ISO.

స్కూల్ కు వచ్చిన ISO ప్రతినిధులు నాణ్యమైన విద్య, ల్యాబ్, విద్యార్దుల సృజనాత్మకత, పరిసరాల శుభ్రత, విద్యార్థుల ప్రవర్తన, మొక్కల పెంపకం లాంటి 40 అంశాలను పరిశీలించారు. వీటిల్లో 30 అంశాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు చేతుల మీదుగా స్కూల్ కు సర్టిఫికేట్ అందించారు.

రామునిపట్ల స్కూల్లో చదువుతో పాటు బోధనేతర అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. సబ్జెక్ట్స్ తో పాటు సోషల్, కల్చరల్ యాక్టివిటీస్ పైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వ్యాసరచన, ఉపన్యాసాలు, పెయింటింగ్స్, మొక్కల పెంపకం, పరిశుభ్రత లాంటి అంశాల్లో మెలకువలు నేర్పిస్తారు. ప్రతీ విద్యార్ది ఒక్కో మొక్కను పెంచుతున్నారు. ఆ మొక్క సంరక్షణ అంతా ఆ విద్యార్థే తీసుకుంటారు.

విద్యార్దుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి ప్రభుత్వ పాఠశాలకు ISO గుర్తింపు తెచ్చింది. రామునిపట్ల స్కూల్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy