సినిమాల్లేవ్.. ! ప్రజా జీవితానికే అంకితం – పవన్ కల్యాణ్

హైదరాబాద్ : సినీ – రాజకీయ ప్రయాణాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. త్వరలోనే పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై స్పందిస్తూ మీడియాకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కల్యాణ్. తాను త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పారు పీకే. ఏ సినిమాలోనూ నటించేందుకు అంగీకారం తెలపలేదని క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో నటించేంత టైమ్ తనకు లేదన్నారు పవన్ కల్యాణ్. ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయించానని చెప్పారు. ప్రజల్లోనే ఉంటూ… జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న ఈ సమయంలో… సినిమాలపై దృష్టి పెట్టే ఆలోచన లేదన్నారు.  ప్రజాక్షేమం కోసం, సమ సమాజ స్థాపన కోసమే తాను ఆలోచిస్తున్నానని చెప్పారు పవన్ కల్యాణ్.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy