సినిమాల్లోకి రాందేవ్ బాబా

9brk-babaయోగా గురువు రాందేవ్‌ బాబా సినిమాలో నటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.  లోమ్‌ హర్ష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘యే హై ఇండియా’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. టైటిల్‌కి తగ్గట్టుగానే దేశ భక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లండన్‌లో పుట్టి పెరిగిన 25 ఏళ్ల యువకుడు భారత్‌ను ఓ పేద దేశంలా భావిస్తుంటాడు. భారతదేశంలో వస్తున్న మార్పులను చూసి తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటాడు అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాందేవ్‌ బాబా ‘సయ్యా సయ్యా’ అనే పాటలో నటించనున్నారు. రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాందేవ్‌ బాబా ఒప్పుకోలేదట. దేశ భక్తి నేపథ్యంలో రాబోతున్న సినిమా కాబట్టే రాందేవ్‌ బాబా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని నిర్మాత సందీప్‌ చౌదరి తెలిపారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy