సినిమాల నుంచి అప్పుడే తప్పుకునే వాడిని

pavan-speechసినిమాల కన్నా తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమన్నారు ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. బోస్టన్ లోని హార్వర్డ్ వర్శిటీలో జరుగుతున్న ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సుకోసం అమెరికా వెళ్లారు పవన్. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో కలిసి చర్చలు జరిపారు. న్యూ హ్యాంప్ షైర్ లో మీట్ అంట్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన పవన్ తన పొలిటికల్ ప్లాన్స్… ఐడియాలజీ గురించి చెప్పారు. జానీ సినిమా కనుక హిట్ అయి ఉంటే అప్పుడే తాను సినిమాలనుంచి తప్పుకునేవాడినని చెప్పారు.

కుల రాజకీయాలు అస్సలు తనకు నచ్చవని .. తనకి దెబ్బ తినడమే కాదు దెబ్బ కొట్టడం కూడా తెలుసని అన్నాడు. ఇక స్పీచ్ మధ్యలో ఎర్ర టవల్ ని ధరించిన పవన్ ఈ టవల్ సామాన్యుడి కి గుర్తు అంటూ తెలిపారు.. తాను రాజకీయాలలోకి వద్దామని అనుకున్నప్పుడు చాలా బెదిరింపులు వచ్చాయని చెప్పిన పవన్, నేను ఏదైన చేసే ముందు ఒకసారి ఆలోచిస్తానే తప్ప దేనికి భయపడనని ధైర్యంగా చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy