సినిమా ఫిక్స్ : హీరోయిన్ గా రాజశేఖర్‌ కుమార్తె

SHIVANI1రాజశేఖర్, జీవితల గారాల ప‌ట్టీ శివాని త్వరలో హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. కాక‌పోతే ఆమె తొలిసారి నటించబోయేది ఏ హీరోతో? ఎలాంటి సినిమా చేయబోతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆ మ‌ధ్య‌ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ హీరోగా పరిచయం అయ్యే సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందని వార్త‌లు రాగా, లేటెస్టుగా బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ తో శివానీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంద‌ని చెబుతున్నారు.

అడ‌వి శేష్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాకి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండ‌గా, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు స‌మాచారం. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడట‌. ఇటీవ‌ల శివాని ఫోటో షూట్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. త్వ‌ర‌లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy