సినిమా రివ్యూ : సర్కార్

రివ్యూ: సర్కార్

రన్ టైమ్: 2 గంటల 44 నిమిషాలు

నటీనటులు: విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, యోగిబాబు, రాధా రవి, తులసి, పాలా కరుప్పయి తదితరులు

సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగధరన్

మ్యూజిక్: ఎ.ఆర్ రహమన్

నిర్మాత : అశోక్ వల్లభనేని,సన్ పిక్చర్స్

కథనం,దర్శకత్వం: ఎ.ఆర్ మురుగదాస్

రిలీజ్ డేట్: నవంబర్ 6,2018

కథేంటి?

వరల్డ్ లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మన్ అయిన సుందర్ (విజయ్) ఓటు వేసేందుకు ఇండియా వస్తాడు. కానీ తన ఓటును ఎవరో దొంగతనంగా వేస్తారు. సొసైటీ మీద కన్సర్న్ ఉన్న తను… ఓటు కోసం ఫైట్ చేస్తాడు. లీగల్ గానూ పోరాడతాడు. ప్రభుత్వాన్నే దించేసే వరకు వెళ్తాడు. హీరో ఇంత చేస్తుంటే.. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తారు. వాళ్లను సుందర్ ఎలా ఎదుర్కొన్నాడు.. సుందర్ లక్ష్యం ఏంటి అనేది స్టోరి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
హీరో విజయ్  ఈ కథ కు బాగా సూట్ అయ్యాడు. తన మానరిజం, మాస్ అటిట్యూడ్ తో సినిమాను తన భుజాలపై మోశాడు. కీర్తి సురేష్ ఇంపార్టెన్స్ లేదు. తను ఎందుకు ఈ రోల్ ఎంచుకుందో తెలియదు. నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ మెప్పించింది. తన ఆహార్యం కూడా ఆకట్టుకుంటుంది. రాధారవి తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. పాలా కరుప్పయి ఓకే. యోగిబాబు కామెడీ పండలేదు.

టెక్నికల్ వర్క్:

గిరీష్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తన పనితనం ఇంప్రెసివ్ గా ఉంది. ఎ.ఆర్ రహమన్ సంగీతం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పాటలేవి వినసొంపుగా లేకపోగా..  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ డైలాగులు బాగానే పేలాయి.

విశ్లేషణ:

‘‘సర్కార్’’ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన పొలిటికల్ ఎంటర్ టైనర్. కథ మొదలైన పాయింట్ ఇంట్రస్టింగ్ గానే ఉన్నా.. ద్వితియార్థం వచ్చేసరికి రొటీన్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అంతేకాదు మురుగదాస్ పసలేని కథనం వల్ల నీరసంగా తయారైంది. ఫస్టాఫ్ లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. హీరో ఓటు దొంగలించడం, దానికోసం అతను ఫైట్ చేయడం అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. సెకండాఫ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులను మురుగదాస్ డిజప్పాయింట్ చేశాడు. సెకండాఫ్ సీన్లు చేస్తుంటే ఈ మధ్య వచ్చిన పొలిటికల్ సినిమాలు, భరత్ అనే నేను, నోటాలు గుర్తుకొస్తాయి. ఫస్టాఫ్ లో ఉన్నంత ఎలివేషన్ సీన్లు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో లేకపోవడంతో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోతారు. రాజకీయాల గురించి, ఓట్ల గురించి హీరో ఇచ్చే లెక్చర్లు ఎక్కువయ్యేసరికి బోర్ కొడుతుంది. సినిమా చూస్తుంటే హీరో విజయ్ పొలిటికల్ ప్లాన్ స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ సినిమా తన ఫ్యాన్స్ వరకు నచ్చుతుందేమో కానీ, సగటు ప్రేక్షకుడు పెట్టిన డబ్బుకు మాత్రం న్యాయం చేయదు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy