సినిమా హాళ్లలో జాతీయగీతంపై.. సుప్రీం కోర్టు వివరణ

National-Anthem-cinema-hallsసినిమా హాళ్లలో జాతీయగీతం వచ్చినప్పుడు నిలబడాలన్న నిబంధనపై వివరణ ఇచ్చింది  సుప్రీం కోర్టు. దేశ ప్రజలు మదర్ ల్యాండ్ పై ప్రేమ భావంతో మెలగాలనీ, ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించడానికి ఈ తీర్పు ఉపయోగపడుతుందని జాతీయగీతంపై తీర్పిచ్చిన అపెక్స్ కోర్టు ఇదివరకు వ్యాఖ్యానించింది. ఆటమొదలయ్యే సమయానికి.. దేశంలోని ప్రతి సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ప్లే చేయాలని.. ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని.. గతేడాది నవంబర్ 30న అపెక్స్ కోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.

జాతీయ గీతం వచ్చిన ప్రతిసారీ లేచి నిలబడాలా? వద్దా? అని శ్యామ్ నారాయణన్ అనే పిటిషనర్ కోర్టులో  పిల్ వేశాడు. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. దీనికోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు.

మూవీ, డాక్యుమెంటరీ, న్యూస్ రీల్ స్టోరీలో భాగంగా జాతీయ గీతం వస్తే.. నిలబడాల్సిన పనిలేదని చెప్పింది జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్. అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ తీర్పుపై క్లారిటీ ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. పిటీషనర్ వాదనను పరిశీలించిన ఈ బెంచ్.. తదుపరి విచారణను ఏప్రిల్ 18 కు వాయిదా వేసింది.

One Response to సినిమా హాళ్లలో జాతీయగీతంపై.. సుప్రీం కోర్టు వివరణ

  1. rakesh says:

    Enti Idi jatiya geetham kosam nilabadadaniki intha show Enduku.coutry ni love chesevallu Ela Aina nilabadatharu

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy