హీరో రవితేజ తమ్ముడు భరత్ మృతి

BHARATHసినీ హీరో రవితేజ సోదరుడు భరత్ చనిపోయాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ లో ఈ ఘోరం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. స్కోడా ( TS09EC 799) వెహికల్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నోవాటెల్ హోటల్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా.. కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ లోనే భరత్ చనిపోయాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు వేగం 140కిలోమీటర్లుగా రీడింగ్ చూపిస్తుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టర్ అయ్యింది. అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. కారు రిజిస్టర్ మరొకరి పేరున ఉండటం.. భరత్ ముఖం బాగా డ్యామేజ్ కావటంతో ఎవరో గుర్తించటానికి సమయం పట్టింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy