సినీ ఇండస్ట్రీ షాక్ : అమెరికాలో సెక్స్ రాకెట్ – తెలుగు నిర్మాత అరెస్ట్

chikagoఅమెరికా చికాగోలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ తెలుగు సినీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. అమెరికాలోని తెలుగువాళ్లు అవాక్కయ్యారు. కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు చికాగో పోలీసులు. కేసు వివరాల్లోకి వెళితే.. అమెరికాలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు కిషన్ మొదుగుమూడి అలియాస్ శ్రీరాజు చెన్నుపాటిగా. ఎంతో పాపులర్ అయిన కిషన్.. అమెరికాలో ఉండే తెలుగులో చిన్న చిన్న సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. చికాగోలోని వెస్ట్ బెల్డన్ ఏరియాలో 5700 నెంబర్ లోని రెండు అంతస్తుల అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

తెలుగు హీరోయిన్స్‌, యాంకర్స్‌, క్యారెక్టర్ ఆర్టిస్టులను సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ పేరుతో తాత్కాలిక వీసాతో అమెరికా తీసుకెళ్లి ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు కిషన్ మొదుగుపూడి. ఖ‌రీదైన హోటల్స్‌లో బస ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత.. వారికి డబ్బు ఆశ చూపిస్తారు. వ్యభిచారం రొంపిలోకి బలవంతంగా దింపుతారు. తన అపార్ట్ మెంట్ తోపాటు, ఖరీదైన హాటల్స్ లో ఈ వ్యవహారాన్ని కిషన్ మొదుగుమూడి నడిస్తున్నట్లు చికాగో ట్రిబ్యూన్ పత్రిక ప్రముఖంగా కథనం ప్రచురించింది.

తెలుగు సినిమాల్లో నటించే ఓ చిన్న నటి ఇటీవల అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇచ్చేందుకు వెళ్లింది. ఆ తర్వాత వారితో అసాంఘిక కార్యక్రమాలకు వెళ్లే విధంగా ప్రోత్సహించాడు కిషన్. అందుకు వ్యతిరేకించిన ఆ నటి.. చికాగో పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగారు పోలీసులు. గుట్టు మొత్తం రట్టయ్యింది. నిందితుడు కిషన్ తోపాటు ఆయన భార్య చంద్ర కూడా భాగస్వామ్యం అయినట్లు గుర్తించారు. ఈ చీకటి వ్యవహారాలకు సంబంధించి చిట్టా కూడా రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏ నటి ఎన్నిసార్లు అమెరికా వచ్చింది.. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలను చంద్ర దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. ఒక్కో డీల్ కు 3వేల అమెరికా డాలర్లు వసూలు చేసినట్లు చిట్టా లెక్కలు చెబుతున్నాయి.

అదేవిధంగా త‌న‌ని మాన‌సిక క్షోభ గురి చేయొద్దు.. ఇలాంటి బిజినెస్‌లో నన్ను భాగం చేయొద్దు అంటూ వేడుకుంటూ ఓ నటి రాసి రాసిన మెయిల్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నటి ఎవరు అనేది మాత్రం తెలిపలేదు. మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుందని.. ఇప్పటి వరకు ఎంత డబ్బు చేతులు మారింది.. ఎంత మంది పాత్ర ఉంది అనేది విచారణ చేస్తున్నారు. ఇంట్లో చేసిన సోదాల్లో బ్యాగుల్లో 70 కండోమ్స్, మొబైల్ ఫోన్లు, ల్యాబ్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 42 పేజీల చార్జిషీట్ ను చికాగో జిల్లా కోర్టుకు సమర్పించారు పోలీసులు. కిషన్ మొదుగుమూడి, అతని భార్య చంద్ర ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకా బెయిల్ రాలేదు. చికాగో ట్రిబ్యూన్ పత్రిక బ్రేకింగ్ కథనం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy