సిమ్‌ వెరిఫికేషన్‌కు కొత్త పద్ధతి..

టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు మొబైల్‌ కనెక్షన్లకు కొత్త డిజిటల్‌ కేవైసీ ప్రాసెస్‌ను ప్రారంభించాయి. ఆధార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను ఆపివేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో కంపెనీలన్నీ ప్రత్యామ్నాయ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను చేపట్టాయి. ఢిల్లీ, యూపీ(ఈస్ట్‌‌‌‌‌‌‌‌), యూపీ(వెస్ట్‌‌‌‌‌‌‌‌) వంటి ప్రాంతాల్లో ని ఎంపిక చేసిన సర్కిళలో ప్రత్యామ్నాయ డిజిటల్‌ కేవైసీ ప్రాసెస్‌ను ప్రారంభించామని, మిగతా లొ కేషన్లకు కూడా దీన్ని విస్తరించనున్నామని భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌ చెప్పింది. ప్రత్యామ్నాయ డిజిటల్‌ కేవైసీ ప్రాసెస్‌లో అడ్రస్‌ ప్రూఫ్‌ను, ఐడెంటిటీని స్కాన్‌ చేయడం, లైవ్‌గా కస్టమర్‌ ఫోటోను తీసుకోవడం, ఆన్‌లైన్‌ కస్టమర్‌ అక్విజిషన్‌ ఫామ్‌‌‌‌‌‌‌‌ సమర్పించడం చేయాల్సి వుంటుంది.

ఈ మొత్తం ప్రక్రియంతా డిజిటల్‌గానే సాగుతుంది. వొడాఫోన్‌, ఐడియా కూడా కొత్త డిజిటల్‌ కేవైసీ ప్రాసెస్‌ను ప్రారంభించినట్టు కన్‌ఫామ్‌‌‌‌‌‌‌‌ చేసింది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్టు తెలిపింది. రిలయన్స్‌‌‌‌‌‌‌‌ జియో కూడా త్వరలో ఇదే ప్రక్రియను ప్రారంభించబోతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఆధార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ కేవైసీ ప్రక్రియ ను పూర్తిగా ఆపివేయాలని టెలికాం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెం ట్‌, టెల్కోలను ఆదేశించింది. కానీ కొన్ని టెల్కోలు, ఆధార్‌ కేవైసీ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను నవంబర్‌ 20 వరకు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి.ఆలోపు కొత్త డిజిటల్‌ ప్రాసెస్‌ను అమల్లోకి తెస్తామని అన్నాయి. పాత సబ్‌‌‌‌‌‌‌ ‌స్క్రైబర్లకైతే పూర్తిగా ఆధార్‌ రీవెరిఫికేషన్‌ ప్రక్రియను ఆపివేస్తామని హామీ ఇచ్చాయి. అయితే గడువు పొడిగించడానికి తమకు అధికారం లేదని, ఒకవేళ ఆపరేటర్లు పొడిగింపును కోరుకుంటే, UIDAI దగ్గ రకు వెళ్లాలని, తాము సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని టెలికాం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy