సిరియా ర‌క్త‌సిక్తం: ఈ చిన్నారులు చేసిన పాప‌మేంటి..?

siryaసిరియాలో మ‌రోసారి ర‌క్త‌పాతం జ‌రిగింది. యుద్ద విమానాల నుంచి ర‌సాయ‌న బాంబులు వేయ‌డంతో అమాయ‌కులైన చిన్నారుల‌తో పాటు మొత్తం 100 మంది మృతి చెందారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో ఈ గ్యాస్ దాడి బీభ‌త్సం సృష్టించింది. ఈ దాడిలో 100 మంద‌కి పైగా తీవ్ర‌గాయాల‌య్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ట‌ర్కీకి త‌ర‌లించారు. విష‌వాయువును పీల్చిన ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారులు గిల‌గిలా కొట్టుకోవ‌డం ప్ర‌సార మాధ్య‌మాల్లో టెలికాస్ట్ అవ్వ‌డంతో గుండెలు త‌రుక్కుపోయాయి. ఈ కెమిక‌ల్స్‌ను పీల్చినవారు నోటినిండా నురుగును క‌క్కుతూ క‌నిపించారు.

తిరుగుబాటు దారుల అధీనంలో ఇడ్లిబ్ ప్రావిన్స్ ఉండ‌టంతో సిరియా ప్ర‌భుత్వమే ఈ దాడుల‌కు తెగ‌బ‌డింద‌ని విప‌క్షాలు ఆరోపించాయి. అయితే ఈ దాడులు ప్ర‌భుత్వం చేసింది కాద‌ని సిరియా సైన్యం చెబుతోంది. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో దాడి జ‌రిగిన కొద్ది గంట‌ల‌కే బాధితుల‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఓ హాస్పిట‌ల్‌పై కూడా దాడి జ‌ర‌గ‌డంతో ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింది.

సిరియాపై దాడిన ఖండించారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ దాడి పిరికిపంద‌ల చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అన్ని దేశాలు ఈ దాడిని ఖండించాల్సిందిగా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ దాడులు ఇంకా జ‌రుగుతున్నాయంటే గ‌త పాల‌కులు చేసిన త‌ప్పిదాలు, తీసుకున్న త‌ప్పిద నిర్ణ‌యాలేన‌ని ప‌రోక్షంగా ఒబామాను ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారు ట్రంప్‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy