సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

Australia v India - Game 3వరుసగా మూడోసారి టీమిండియా ఓడింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం  సాధించి 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. రెండో వన్డే లో ఓటమి పాలైన తర్వాత కనీసం 330 పరుగులు చేస్తామని చెప్పిన కెప్టెన్ ధోనీ 295 పరుగుల చేసి 296 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఆచితూడి ఆడిన ఆస్ట్రేలియా మూడో వన్డేలో కూడా విజయాన్ని సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 296 పరుగుల టార్గెట్ ఉంచింది. విరాట్ కోహ్లి సెంచరీకి తోడు ధావన్(68) రహానే(50) ఆఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.5 ఓవర్లలో 296 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లలో మ్యాక్స్ వెల్ 96, ఎస్ఈ మార్ష్ 62, స్మిత్ 41, బైలీ 23 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ కు తలా రెండు వికెట్లు దక్కాయి.

కాగా ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ వన్డేతో కలిపి 3 మ్యాచ్‌ల ఆధిక్యం సాధించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో 2 మ్యాచ్‌లు మాత్రమే సిరీస్‌లో మిగిలి ఉన్నాయి. వాటిని ఇండియా గెలిచినా ప్రయోజనం ఉండదు.. కానీ పరువు నిలుపుకోవాలంటే ఆ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం తప్పనిసరి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy