సిరీస్ ఓడిపోవడంతో ధోనీపై కోపం..!

22-1434951081-bangladesh-win-india-series-600బంగ్లాదేశ్ తో సిరీస్ ఓడిపోవడంతో ఇండియా కెప్లెన్ ధోనీ మీద విమర్శలు వస్తున్నాయి.  కెప్టెన్సీని ధోనీ వదులుకోవాలన్న డిమాండ్ మొదలైంది. నిన్నటి రెండో వన్ డే లో బంగ్లా ప్లేయర్లు చెలరేగడంతో ఈ విమర్శల వాన మొదలైంది. బంగ్లా ప్లేయర్లు అద్భుతంగా ఆడి వాల్డ్ క్రికెట్ లో సెన్షేషన్ క్రియేట్ చేశారు. టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడించారు. మీర్పూర్ లో జరిగిన సెకండ్ వన్డేలో… 6వికెట్ల తేడాతో స్టన్నింగ్ విక్టరీ కొట్టింది బంగ్లాదేశ్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీ గ్యాంగ్ 45ఓవర్ల లో 200 పరుగులకే ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ చివర్లో వర్షం పడడంతో… మ్యాచ్ ను 47ఓవర్లకు తగ్గించారు. శిఖర్ ధావన్ 53, ధోనీ 47 రన్స్ చేశారు. కోహ్లీ 23, రైనా 34 పరుగులు చేయగా… మిగతా బ్యాట్స్ మెన్ దారుణంగా ఫెయిలయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రహమాన్… 6వికెట్లతో చెలరేగిపోయాడు. ఫస్ట్ వన్డేలో 5వికెట్లు పడగొట్టిన ముస్తఫిజుర్… సెకండ్ వన్డేలోనూ… భారత బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు.

డక్ వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్ ను 47 ఓవర్లలో 200 రన్స్ గా డిసైడ్ చేశారు. 38ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది బంగ్లా. షకీబుల్ హాసన్ 51, లిటన్ దాస్ 36, సౌమ్య సర్కార్ 34, ముష్ఫీకర్ 31 రన్స్ చేశారు. ముస్తఫిజుర్ టాలెంట్ ముందు … మన బౌలర్లు తేలిపోయారు. అటు టార్గెట్ కూడా చిన్నదికావడంతో… బంగ్లా బ్యాట్స్ మెన్… స్వేచ్ఛగా ఆడారు. ఈ విజయంతో… 3వన్డేల సిరీస్ ను 2-0తేడాతో గెలుచుకుంది బంగ్లాదేశ్. భారత్ పై బంగ్లా సిరీస్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్. 6వికెట్లతో సత్తా చాటిన ముస్తఫిజుర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్ లో చివరిదైన మూడో వన్డే… 24న ఢాకాలో జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy