సిరీస్ మనదే: కుర్రోళ్లు అదరగొట్టారు

Umesh Yadav, Karun Nairనాలుగు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. నాలుగో టెస్టులో అపూర్వ విజయంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ భారత్ సొంతమైంది. నాలుగో టెస్టులో బ్యాట్స్ మెన్, బౌలర్ల సమష్టి కృషితో… ఆసీస్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 106 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మంగళవారం 19 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మ్యాచ్ ప్రారంభించిన టీమిండియా..  14వ ఓవర్లో 46 పరుగుల దగ్గర విజయ్(8) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పుజారా స్కోర్ ఓపెన్ చేయకుండానే రన్ అవుట్ గా వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్న రాహుల్(52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రహానే(38)తో కలిసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 2 – 1తో భారత్ సొంతమైంది.

నాలుగో టెస్టులో భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ కుప్పకూలారు. తొలి ఇన్నింగ్స్ లో కొత్త కుర్రాడు కుల్దీప్ యాదవ్ కంగారుల నడ్డి విరిస్తే…. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్, జడేజా, యాదవ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ ఆటకట్టించారు.

స్కోర్ బోర్డు:

ఆసీస్ – 300 & 137

భారత్ – 330 & 107/2

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy