సిరీస్ మనదే: విండీస్ పై టీమిండియా విక్టరీ

indiaవెస్డిండీస్ గడ్డపై భారత్ విజయ దుందుభి మోగించింది. విండీస్ తో జరిగిన  ఐదు వన్డేల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. కింగ్ స్టన్ లో జరిగిన ఐదో వన్డేలో భారత్ విండీస్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేయగా…206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 36.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించి విజయం సాధించింది. కోహ్లీ 115 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సిరీస్ ఆద్యంతం అద్బుతంగా రాణించిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించగా, చివరి వన్డేలో అద్బుత సెంచరీతో అజేయంగా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు.

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ

విండీస్ తో జరిగిన 5వ వన్డేలో కోహ్లీ ఖాతాలో మరో కొత్త రికార్డు నమోదైంది. 115 బంతుల్లో 111 రన్స్ చేయడంతో వన్డేల్లో ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ 18 సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 232 వన్డేలు ఆడి ఛేజింగ్ లో 17 శతకాలు చేయగా కోహ్లీ కేవలం 102 ఇన్నింగ్స్ లోనే ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy