సీఎం కారు చోరీ

ARAVINDఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీ అయ్యింది. 2015 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఆయన ఉపయోగించిన బ్లూ కలర్ వ్యాగన్ ఆర్ కారు దొంగతనానికి గురైంది. ఢిల్లీ సచివాలయం బయట నిలిపిన సీఎం కారును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆమ్ ఆద్మీ బొమ్మతో ఉన్న ఈ కారును ప్రస్తుతం ఆప్ మీడియా సమన్వయం చేసే వందనా సింగ్.. పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు. సెక్రటేరియట్ బయట నిలిపి ఉంచిన ఈ కారు గురువారం( అక్టోబర్-12) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కనిపించకుండాపోయింది.

ఈ కారును 2013లో కుందన్ శర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేజ్రీవాల్‌కు ఇచ్చారు. కారు చోరికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తమకు ఫిర్యాదు అందినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ మన్‌దీప్ రద్వానా తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy