సీఎం కుమారస్వామికి అనారోగ్యం.. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలకు దూరం

కర్ణాటక : 18వ శతాబ్దంలో మైసూరును పాలించిన మహరాజు టిప్పు సుల్తాన్ జయంతికి ఒకరోజుముందు కర్ణాటకలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలకు సీఎం కుమారస్వామి దూరంగా ఉంటున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అనారోగ్యం కారణంగా… నవంబర్ 11 వరకు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు కోరడంతో… ముఖ్యమంత్రి టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో పాల్గొనడం లేదని అధికారులు  ప్రకటించారు.

మరోవైపు.. టిప్పు సుల్తాన్ ఓ రాజు కాదు.. అతడు ఓ నియంత అని  అతడి జయంతిని వేడుకగా జరపకూడదంటూ కర్ణాటక బీజేపీ నిరసన తెలుపుతోంది. శనివారం రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడానికి సిద్ధమైంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించడం మొదలుపెట్టింది. ఆ ఆనవాయితీని కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఐతే… ఈ వేడుకలకు దూరంగా ఉండాలని సీఎం కుమారస్వామి నిర్ణయించడం ఆసక్తి కలిగిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy