సీఎం కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధం…

kcrrముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు రెడీ అయ్యారు కేసీఆర్. తన సొంత నియోజక వర్గం మెదక్ జిల్లా గజ్వేల్ లో బహిరంగ సభ నిర్వహించటంతో పాటు.. అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. సీఎంగా కేసీఆర్ మొదటి పర్యటన కావటంతో.. అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, పోలీసులు. అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పిడిచెడ్ రోడ్డు దగ్గరలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనపై మంత్రి హరీష్ రావు, కలెక్టర్ స్మితా సబర్వాల్, జేసీ, ఎస్పీలు సమీక్ష జరిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వర్గల్ లోని విద్యా సరస్వతి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు కేసీఆర్. రెండు గంటలకు ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో జరిగే బైక్ ర్యాలీలో పాల్గొంటారు. రెండున్నరకు బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మూడున్నరకు నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరుపుతారు. రాత్రి 7గంటల 15 నిమిషాలకు జగదేవ్ పూర్ మండలంలోని తన ఫాం హౌస్ కు చేరుకుంటారు కేసీఆర్.
సభకు తెలంగాణావాదులు, పార్టీ శ్రేణులను భారీగా తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీబాస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వస్తున్న సందర్భంగా.. కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు రెడీ అయ్యారు లీడర్లు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy