సీఎం కేసీఆర్ పై పబ్లిక్ ఏమంటోంది…?

kcrతెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కూడ అయ్యాడు. తెలంగాణ పరిస్థితులకు తగిన పథకాలనే తెస్తున్నామంటున్న కేసీఆర్ పాలన తీరును సర్వేల చెప్పారు జనం. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల పాలనపై గట్టి నమ్మకంతో ప్రజలు ఉన్నట్లు సర్వేద్వారా వెల్లడైంది. నాలుగు రకాలుగా ప్రశ్నలు అడిగినప్పటికీ కేసీఆర్ కే జనం మార్కులు వేశారు. మూడేళ్ల పనితీరు చాలా బాగుందని నూటికి 83 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 14 శాతం మంది బాగాలేదని చెప్పారు. ఇంకో మూడు శాతం మంది స్పందన తెలియజేసేందుకు నిరాకరించారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఎన్ని మార్కులిస్తారని అడిగితే ఎక్కువ మంది 90 మార్కులేశారు. ఇలా సర్వేలో 61 శాతం మంది 90 మార్కులు వేశారు. మరో 25 శాతం మంది 60 శాతం మార్కులేసి ఫస్ట్ క్లాసులో నిలిపారు. 30లోపు మార్కులు వేసినవారు 14 శాతం మంది ఉన్నారు.

తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న ప్రశ్నకు 76 శాతం మంది కేసీఆరే అని చెప్పారు. ముఖ్యమంత్రిగా వేరే పార్టీల నాయకులైతే బాగుంటుందని కోరుకునేవారు 18 శాతం మంది వరకున్నారు. వేరే పార్టీవారు కాకుండా ఇంకా కొత్త నాయకత్వం కావాలని 6 శాతం మంది అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల జనం నుండి సర్వేలో ఇలాంటి అభిప్రాయం వ్యక్తమైంది.

2019 ఎన్నికల్లో ఏ పార్టీ సర్కార్ వస్తుందన్న ప్రశ్నకు టీఆర్ఎస్ అని 73 శాతం మంది అన్నారు. కాంగ్రెస్ వస్తుందని 14 శాతం మంది, బీజేపీ అని 6 శాతం మంది, టీడీపీ అని 3 శాతం మంది చెప్పారు. వీళ్లెవరు కాదని చెప్పినవారు మరో 4 శాతం మంది ఉన్నారు.

సర్వేలో పాలన బాగలేదని చెప్పినవారు, సీఎంకు తక్కువ మార్కులు వేసినవారు, తర్వాత సీఎం వేరే లీడర్ రావాలని చెప్పినవారు, తర్వాత సర్కార్ ప్రతిపక్షంలో రావాలని అంటున్నవారు దగ్గరదగ్గరగా 14 శాతం మంది ఉన్నారు. ప్రశ్నలు మారినా కూడ జనం ఒకేలాంటి ఆలోచనతో ఉన్నట్టు సర్వేలో తేలింది.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే రిజర్వేషన్లు, రైతులకు ఎకరాకు రూ.4వేలు ప్రకటించకముందే ఈ సర్వే తయారైంది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy