సీఎం కొత్త ప్లాన్.. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత

cmkcr2ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో..  అంశాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలంటే… అధికారులు మరింత అంకితభావంతో పనిచేయాలన్నారు కేసీఆర్. గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా…  ఆర్థిక సాయం అందించే  బాధ్యతలను CMO అధికారులు నర్సింగ్ రావు, శాంతి కుమారికి అప్పగించారు.  కల్తీలు, డ్రగ్స్ విషయాల్లో వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి,….  బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో సవరణలపై  సిఫారసు చేసే బాధ్యతను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డికి అప్పగించారు.

.. వ్యవస్థీకృత నేరాలను అదుపుచేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ తరహాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను  ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు ఇచ్చారు.

.. కల్తీ విత్తనాలు తయారు చేసే కేంద్రాలు,  ఆహార పదార్దాల కల్తీ జరిగే ప్రదేశాలపై దాడులు  పర్యవేక్షణ బాధ్యతను డీజీపీ  అనురాగ్ శర్మకు అప్పగించారు.

.. డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, అందరికీ శిక్షలు పడే దాకా చర్యలు తీసుకునే బాధ్యతను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ కు అప్పగించారు  సీఎం కేసీఆర్.

.. హైదరాబాద్ తో పాటు…  రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో డ్రగ్స్ వ్యాప్తి నిరోధానికి అనుసరించాల్సిన వ్యూహాల అమలు  బాధ్యతను  హైదరాబాద్, వరంగల్ ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డికి అప్పగించారు.

.. హైదరాబాద్ చుట్టు పక్కల విత్తనాలు, ఆహార కల్తీ జరిగే ప్రాంతాలను గుర్తించి…, కలెక్టర్ల సహకారంతో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ కు అప్పగించారు.

.. అక్రమాలకు పాల్పడే అధికారులపై  చర్యల బాధ్యతను ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావుకు అప్పగించారు.

.. పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు,  సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యతను పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, ఎండి మల్లారెడ్డిలకు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

.. ఎక్సైజ్ శాఖను బలోపేతం చేసే చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు అప్పగించారు.  .. విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు ఎమ్మటే  వచ్చే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ కు అప్పగించారు.

.. హైదరాబాద్ లో కావాల్సినంత మంది ఫుడ్ ఇన్స్ పెక్టర్ల నియామకం బాధ్యతను GHMC కమిషనర్ జనార్థన్ రెడ్డికి అప్పగించారు.

.. దూల్ పేటలో గుడుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు బాధ్యతలను హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కు అప్పగించారు సీఎం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy