సీఎం తన బడిని మార్చుకుంటున్నారిలా…

eenadu kcrసొంత నియోజకవర్గం.. మెదక్ జిల్లా గజ్వేల్ పై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఇవాళ సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు.. తనకు చదువుచెప్పిన గురువులను కలుస్తారు. ఆ తరువాత  చిన్ననాటి స్నేహితులతో ముచ్చటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు.

దుబ్బాకలో తను 1964లో చదివిన స్కూల్ భవనం శిథిలమవడంతో కొత్త భవనాన్ని మంజూరు చేసిన సీఎం.. ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఆధునిక సౌకర్యాలతో.. అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేలా.. ఈ స్కూల్ ను ప్రభుత్వం నిర్మించనుంది. పనుల కోసం ఇప్పటికే 4 కోట్ల 67 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఈ భవనం ఊహా చిత్రాన్ని కూడా సీఎం ఆమోదించారు.

eenadu kcr school

 

 

 

ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి… జగదేవ్ పూర్ మండలం నర్సన్నపేట కూడవెల్లి వాగు చెక్ డ్యాంకు శంకుస్థాపన చేస్తారు. నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి దుబ్బాక వెళ్లి.. స్కూల్ కొత్త భవనానికి భూమిపూజ చేస్తారు. మిషన్ కాకతీయ రెండో దశకు సంబంధించి.. రామసముద్రం చెరువు సుందరీకరణ పనులు, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం దుబ్బాక అధికారులు, ప్రజాప్రతినిధిలతో.. అక్కడి ఫంక్షన్ హాల్ లో రివ్యూ చేస్తారు.

లంచ్ బ్రేక్ తీసుకున్నాక.. మధ్యాహ్నం దుబ్బాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో.. అధికారులు, అనధికారులు, గురువులు, బాల్య మిత్రులతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రానికి దుబ్బాక హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను.. మంత్రి హరీష్ రావుతో పాటు.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎస్పీ సుమతి పరిశీలించారు. సీఎం టూర్ కావడంతో.. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy