సీఎం పార్టీపై మండిపడుతున్న సీమాంధ్ర మంత్రులు

1
సీఎం కిరణ్ పార్టీ పెడుతున్నారన్న వార్తలపై సీమాంధ్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. కిరణ్ వ్యక్తిగత స్వార్థం కోసమే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సి. రామచంద్రయ్య. పార్టీ బలహీనపడిందని బయటకెళ్లడం సరికాదన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కిరణ్ ఆశపడుతున్నారన్నారు. సీఎం కిరణ్ అసలు రంగు బయటపడిందన్నారు.

మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రామచంద్రయ్య. కిరణ్ ఇప్పటికైనా కొత్త పార్టీ విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. మంత్రులు సీఎం మాయలో పడోద్దని కోరారు మంత్రి రామచంద్రయ్య.

ఇక సీఎం కిరణ్ పార్టీ పెడితే ప్రజలు ఛీ కొడతారని ఫైర్ అయ్యారు మంత్ర కొండ్రు మురళి. సోనియా దయాదాక్షిణ్యాలతో సీఎం అయిన కిరణ్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన తర్వాత వేరే పార్టీ పెట్టడం మంచిది కాదన్నారు. ఆయన పార్టీ పెట్టినా కాంగ్రెస్ నేతలెవరూ కిరణ్ పార్టీలో చేరరన్నారు. అధిష్టానం ఇప్పటికే కిరణ్ పై చర్యలకు రంగంలోకి దిగిందన్నారు. పీసీసీ చీఫ్ తో భేటీలో సీఎం కిరణ్ వ్యవహారంపై చర్చలు జరుపుతామన్నారు కొండ్రు మురళి.

సీఎం కిరణ్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు మంత్రి బాలరాజు. ఎవరు కొత్తపార్టీ పెట్టినా అధికారం కోసం తప్ప మరో దాని కోసం కాదని ఘాటు విమర్శలు చేశారు. సీఎం కిరణ్ పార్టీ పెట్టినా అందులోకి వెళ్ళనని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ గురించి ప్రజలకు తెలుసన్నారు బాలరాజు. అధిష్టానానికి వ్యతిరేకంగా జరిగే ఏ సమావేశానికి వెళ్ళనన్నారు. హైకమాండ్ లైన్ లో నేతలంతా సాయంత్రం జరిగే సమావేశానికి హాజరవుతామన్నారు.

మొత్తానికి సీఎం కిరణ్ వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు సీరియస్ గా ఉన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సాయంత్రం సీమాంధ్ర నేతలతో భేటీ కానున్నారు. అయితే ఇందులో సీఎం కొత్త పార్టీ, ఆయన వ్యవహార శైలి పై చర్చిస్తారని సమాచారం. మరీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారో లేదా అన్నది చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy