సీఎం ప్రాజెక్టుల బాట: ఇవాళ కరీంనగర్ లో పర్యటన

kcrసీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ఇవాళ (గురువారం,డిసెంబర్-7), రేపు (శుక్రవారం,డిసెంబర్-8) ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం… నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయిలో తిరిగి చూడనున్నారు. బుధవారం(డిసెంబర్-6) సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కరీంనగర్ తీగలగుట్టపల్లికి చేరుకున్న కేసీఆర్ కు మంత్రులు, జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఉత్తర తెలంగాణ భవన్లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి పనులపై రివ్యూ చేశారు సీఎం.

రాత్రి ఉత్తర తెలంగాణ భవన్లోనే బస చేసిన సీఎం.. ఇవాళ ఉదయం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 9.50 కి తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ 10.20 వరకు బ్యారేజ్ పనులను పరిశీలిస్తారు. 10.40 కి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతానికి వెళతారు. 11 గంటల వరకు బ్యారేజ్ పనులను చూస్తారు. 11.15 కు కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్లి 11.45 వరకు పంప్ హౌస్ పనులు జరుగుతున్న తీరు పరిశీలించి అధికారులతో మాట్లాడతారు

మధ్యాహ్నం 12 గంటలకు అన్నారం బ్యారేజ్ దగ్గరకు వెళ్తారు సీఎం కేసీఆర్. 12.20 వరకు బ్యారేజ్ పనులను పరిశీలిస్తారు. 12.40 కి శ్రీపురం పంపుహౌస్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడే లంచ్ చేసి.. తర్వాత 1.30 దాక పంపుహౌస్ ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సుందిళ్ల బ్యారేజ్ దగ్గరకు వెళతారు. 2.20 వరకు అక్కడ జరుగుతున్న పనులను చూస్తారు. 2.45 గోలివాడ పంప్ హౌస్ దగ్గరకు చేరుకొని 3.30 వరకు అక్కడ పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.15 కి రామగుండంలోని NTPC కి చేరుకుంటారు. ఇవాళ రాత్రికి  అక్కడే బస చేస్తారు సీఎం.

రేపు (శుక్రవారం) ఉదయం రామగుండం నుంచి బయల్దేరి 9.20 కి మేడారం పంపుహౌస్ దగ్గరకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటల వరకు పంపు హౌస్ పనులను చూస్తారు పరిశీలిస్తారు. తర్వాత అక్కడే లంచ్ చేసి ప్రాజెక్టు పనులపై అధికారులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.45 కు మల్యాల మండలం రాంపూర్లో పంపుహౌస్ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళతారు. 3.15 వరకు అక్కడ పనులు చూడనున్నారు. 3.40 కు మధ్యమానేరు వెళ్లనున్న సీఎం… 3.45 వరకు మధ్య మానేరును పరిశీలించడం పూర్తయ్యాక రేపు సాయంత్రం 4.30 కు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు అధికారులు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది జయశంకర్ భూపాలజిల్లా పోలీస్. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో బలగాలను మోహరించారు. అన్ని వాహనాలు, రోడ్డుపై కల్వర్టులు  చెక్ చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో భద్రతను పర్యవేక్షించారు జిల్లాఎస్పీ భాస్కరన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy