సీఎం యోగికి షాక్ : గోరఖ్ పూర్ లో బీజేపీ వెనుకంజ

deskఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతలు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య  ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్, పుల్ పూర్ లోక్ సభ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరూ రాష్ట్ర పదవుల్లోకి రావటం.. ఈ రెండు నియోజకవర్గాల్లో మార్చి 11న ఉప ఎన్నిక జరిగింది.

మార్చి 14వ తేదీ బుధవారం జరిగిన కౌంటింగ్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది. సమాజ్ వాదీ పార్టీ (SP) అభ్యర్ధులు గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. అధికార బీజేపీ రెండోస్ధానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం గోరఖ్ పూర్ లో ఎస్పీ అభ్యర్ధి ప్రవీణ్ కుమార్ నిషద్ కి 3,21,093 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ అభ్యర్ధి ఉపేంద్ర దుత్ శుక్లా 2,94,945 ఓట్లతో రెండోస్ధానంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అయితే 13,181 ఓట్లతో మూడో స్ధానానికి పడిపోయింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ పాగా వేస్తుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంతో ఈ ఫలితాలు బీజేపీకి షాక్ కు గురి చేశాయి. ఇక మరో నియోజకవర్గం పుల్ పుర్ లో కూడా బీజేపీకి షాక్ తగిలింది.  2,81,446 ఓట్లతో ఎస్పీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 2,41,764 ఓట్లతో రెండో స్ధానంలో కొనసాగుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy