సీఎం హామీల అమలుకు అధికారుల కసరత్తు

wgl toranamఓరుగల్లు అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేశారు అధికారులు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు కావాల్సిన స్థల సేకరణకు కసరత్తు స్టార్ట్ చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు అధికారులు. మామునూరులో ఉన్న వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంతంలోనే  వెటర్నరీ కాలేజీ చేయాలని నిర్ణయించారు అధికారులు. 120 ఎకారల్లో కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. ములుగు రోడ్డు లో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 120 ఎకరాల్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. స్థలం సరిపోకపోతే రెండు సంస్థలను హసన్ పర్తి మండలం సిద్దాపూర్ కు తరలించాలని భావిస్తున్నారు. ఇక్కడ 300 ఎకరాల ప్రభుత్వం స్థలం అందుబాటులో ఉంది. ఈ ల్యాండ్ ను కూడా అధికారులు పరిశీలించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోసం 18 ఎకరాలు ల్యాండ్ సేకరించారు. ట్రైబల్ యూనివర్సిటీ, కాటన్ రీసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్  కోసం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఓరుగల్లు డెవలప్ మెంట్ కు ఎక్కువ ప్రయార్టి ఇచ్చిన సీఎం కేసీఆర్. సిటీకి వచ్చినప్పుడల్లా  ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. విద్యుత్ కేంద్రం, కాటన్ రీసెర్చ్ సెంటర్, ట్రైబల్ యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీ, ఢిల్లీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy