సీక్రెట్స్ చెప్పేసిన గవర్నర్ : ఎన్నికల్లో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

anandiమధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనంది పటేల్‌ వివాదంలో చిక్కుకున్నారు. సత్నా మేయర్ మమతా పాండే, ఇతర బిజేపీ లీడర్లతో ఆమె మాట్లాడిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చిత్రకూట్‌ కు వెళ్లారు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్. ఆ సమయంలో అక్కడే ఉన్న సత్నా సిటీ మేయర్ మమతా పాండే, ఇతర బీజేపీ నేతలతో ఆమె ముచ్చటించారు. ఈ సమయంలో మరికొన్ని నెలల్లో జరుగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు రావాలంటే ఏం చేయాలనే విషయంపై చర్చించారు. కొన్ని టిప్స్ ని బిజేపీ నేతలకు ఆనందీ ఈ విధంగా వివరించారు.

…పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను దత్తత తీసుకోవాలి

… నిస్సహాయులుగా ఉన్నవారిని దత్తత తీసుకోవాలి

… ఇతరుల సలహాలు, సూచనలు ఓపిగ్గా వినాలి. వాటిని పాటించాలి.

… ప్రజల ఇళ్లలోకి వెళ్లి వారి చేతులు పట్టుకుని మాట్లాడాలి. అప్పుడే నరేంద్ర భాయ్‌ మిషన్ 2022 కల నెరవేరుతుందంటూ అని ఆనందీ బెన్ పటేల్ అక్కడున్న వారికి సూచించారు.

అంతేకాకుండా అక్కడ ఉన్న అధికారులతో ఆనందీ మాట్లాడుతూ.. మీకు ఓట్లు అవసరం లేదు కానీ మాకు కావాలి అంటూ మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఈవిధంగా మాట్లాడడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనంటూ కాంగ్రెస్ విమర్శించింది.

.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy