సీజన్ లో రెండో టైటిల్ గెలిచిన సైనా..!

saina-nehwal-astralian-super-series సైనా నెహ్వాల్ సీజన్ లో రెండో టైటిల్ గెలిచింది. ఆదివారం జరగిన ఆస్ట్రేలియన్ సూపర్ సీరీస్ ఫైనల్ లో స్పైయిన్ ప్లేయర్ కరోలిన మెరిన్ పై గెలిచి ఈ సీజన్ లో రెండో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈ టైటిల్ తో 750,000 యూఎస్ డాలర్స్ గెలుచుకుంది. ఆరో సీడెడ్ సైనా ఇటీవలే ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆస్ట్రేలియన్ సూపర్ సీరీస్ ఫైనల్ లో 43 నిమిషాలు జరిగిన మ్యాచ్ లో మెరిన్ ను 21-18, 21-11 తేడాతో గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్ గెలవడం చాలా సంతోషాన్నిస్తోందని సైనా తెలిపింది. గాయాలు కాకుండా కోచ్ లు ఎప్పటికప్పుడు దగ్గరుండి చాలా కేర్ తీసుకున్నారని తెలిపింది. ఈ ఇయర్ తనకు చాలా ఇంపార్టెంట్ అని సానియా అభిప్రాయపడింది. ఇప్పటి వరకు తను గెలుకున్న మెడల్స్ తనను కాన్ఫిడెన్స్ ను నిలబెడుతున్నాయని తెలిపింది. లాస్టియర్ గాయాల కారణంగా టైటిల్స్ కోల్పోవడం చాలా నిరాశ పర్చినా.. ఈ సారి టైటిల్స్ గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ తనకుందని అభిప్రాయపడింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy