సీనియర్ నటుడు సీకే విశ్వనాథ్ కన్నుమూత

kashi vishwanathప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాథ్(69) చనిపోయారు.  లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ నుంచి  విశాఖపట్నం వెళ్తుండగా ఆయనకు ఖమ్మం సమీపంలో గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కాశీ విశ్వనాథ్  డెడ్ బాడీని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్నట్లు తెలిసింది. తెలుగు సినిమాకు కాశీవిశ్వనాథ్ ఎనలేని సేవలు అందించారు. దాదాపు 70 చిత్రాలకు ఆయన రచయితగా పని చేసారు. తెలుగులో ప్రముఖ దర్శకులైన దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయబాపినీడు తదితరుల సినిమాలకు ఆయన కాశీవిశ్వనాథ్ రచయితగా పని చేసారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy