సీన్ పండలేదు : అప్పులు ఎగ్గొట్టటానికి చచ్చినట్లు నాటకం

SHARE MARKET

షేర్ మార్కెట్ లావాదేవీల సలహాదారు, ప్రజల డబ్బుతో షేర్ల వ్యాపారం.. కొన్నాళ్లు బాగానే నడిచింది.. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యింది. అప్పులు తీసుకొచ్చి చేసిన షేర్ మార్కెట్ వ్యాపారంలో నష్టాలు.. ఒక్క వ్యక్తికే రూ.10 లక్షలు బాకీ పడ్డాడు. చెల్లించటానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం.. ఆస్తులు కూడా లేకపోవటంతో తప్పించుకోవటానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. చనిపోయినట్లు నటించాడు. అప్పులోళ్లకి మెసేజ్ లు కూడా పంపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా బనగానపల్లెకి చెందిన బెక్కం సునీల్‌రెడ్డి హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతంలో నివాసం. షేర్ మార్కెట్ ట్రేడింగ్ విశ్లేషకుడిగా ట్విట్టర్ ద్వారా 3వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. వారి డౌట్స్ క్లియర్ చేస్తూ.. పెట్టుబడులపై చిట్కాలు చెబుతుండేవాడు. కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సునీల్‌రెడ్డి గ్రూపులో కొండాపూర్ ప్రాంతానికి చెందిన నరేశ్ బాబు.. అతడి చిట్కాలతో కొంత లాభం పొంది అతడిని అనుసరించాడు. ఇదే అదునుగా నరేశ్‌ బాబు నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత సునీల్‌ రెడ్డి స్పందించలేదు. ఓ రోజు భరత్ పేరుతో నరేశ్‌బాబు ఫోన్‌ కు ఓ మెసేజ్ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో సునీల్‌రెడ్డి చనిపోయాడు అనేది ఆ సారాంశం. దీన్ని అనుమానించిన బాధితుడు నరేశ్‌ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం (జూన్-13) సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారు.

షేర్ మార్కెట్ లో నష్టాలు రావటం.. తిరిగి చెల్లించే స్థోమత లేకపోవటంతో.. చనిపోయినట్లు నాటకం అడినట్లు వెల్లడించాడు. బాధితులకు డబ్బులు ఎగ్గొట్టేందుకే భరత్ పేరుతో మెసేజ్‌ లు పంపినట్లు ఒప్పుకున్నాడు. ట్రేడింగ్‌ లో నష్టం రావడంతో ఈ స్కెచ్ వేశాడు. ఆన్ లైన్ ట్రేడింగ్ అకౌంట్లు కూడా మార్చాడు. సోషల్ మీడియాలో కొత్త అకౌంట్స్ ఓపెన్ చేశారు. తన గ్రూప్ లో సభ్యులుగా చేరిన వారి నుంచి కూడా నెలకు రూ.25వేల చొప్పున వసూలు చేసినట్లు విచారణలో తేలింది. చనిపోయాడని పెట్టిన మెసేజ్‌ చూసి షాక్ అయ్యామని పోలీసులు సైతం అంటున్నారు. నిందితుడి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరించటం, అతను ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నుంచే అతను బతికి ఉన్నట్లు గుర్తించాం అన్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy