సీమాంధ్రను అద్భుతంగా మార్చేస్తాం

vwada

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడడంతో సీమాంధ్ర ప్రాంతంలో జనం చాలా గుస్సాతో ఉన్నారు. దీనిమీద కొంతమంది కోర్టుకు వెళ్తే, ఈ విభజనను ఒక చాలెంజిగా కూడా తీసుకోవాలనే వాదనలు కూడా బయల్దేరాయి. విజయవాడలో శుక్రవారం జరిగిన ఒక మీటింగులో సీమాంధ్ర ఎలా డెవలప్ చేసుకోవాలన్న విషయంమీద డిస్కషన్ జరిగింది. హైదరాబాద్ లో ఐ టీ ఇండస్ట్రీ అభివ్రుద్ది క్రుషిలో పాలుపంచుకున్న సీమాంధ్ర వ్యాపారులు కొందరు ఈ మీటింగుకు వచ్చారు. సీమాంధ్రను డెవలప్ చేయడం చాలా ఈజీ అనీ, అవకాశమిస్తే, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారుచేస్తామని వీరు కాన్ఫిడెంట్ గా చెప్పారు.

డెవలప్ మెంట్ అంతా ఒక్క హైదరాబాద్ కే పరిమితమైందని, ఈసారి అలా కాకుండా సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలను సమానంగా అభివ్రుధ్ధి  చేయాలని ఈ మీటింగులో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజధానిగా విజయవాడ – గుంటూరు ప్రాంతాన్ని చేసినా, ఒంగోలు ప్రాంతాన్ని చేసినా, కర్నూలును చేసినా, విశాఖపట్నాన్ని సెలెక్టు చేసినా పరవాలేదని….కొత్త రాజధానిగా ఎంపికయ్యే ఆ సిటీని చక్కటి ప్లానింగ్ తో చూడచక్కగా తయారుచేసుకోవచ్చునని మీటింగులో చాలామంది చెప్పారు.

రాజధాని ఏదయినా, సీమాంధ్రలో ప్రాంతాలన్నింటినీ సమానంగా అభివ్రుధ్ధి చేసుకోవాలని మీటింగ్ తీర్మానించింది. విశాఖ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా చేయొచ్చునని, రాయలసీమలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఒంగోలులో హైకోర్టు పెట్టి, విజయవాడ నగరాన్ని కమర్షియల్ గా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని మీటింగులో కొంతమంది సూచించారు. సీమాంధ్రకు ‘స్పెషల్’ హోదాను ఐదేళ్లు కాకుండా పదేళ్ళకు ఇవ్వాలని కూడా సూచనలు వచ్చాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy