సీమాంధ్రలో ఎమ్మెల్యేల రాజీనామాలు

download
లోక్ సభలో తెలంగాణ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదించడంతో..పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తున్నారు.
• కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ తన మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను ఫ్యాక్సులో సోనియా గాంధీకి పంపారు.
• విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా రాజకీయ సన్యాశం తీసుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో ఇయడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
• రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
• యలమంచిలి ఎమ్మెల్యే రమణ మూర్తి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మదనపల్లి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
• పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టి.వి రామారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
• సీఎం కిరణ్ కూడా రేపే రాజీనామా చేస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దానిపై కొంత మంది నేతలు క్లారిటీ ఇచ్చారు. అంటే రేపే సీఎం కిరణ్ రాజీనామా చేయోచ్చు. దీంతో పాటు మంత్రి పార్థసారధి, కాసు కృష్ణారెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
• ఇక సీమాంధ్రకు చెందిన టీడీపీ నేతలు రేపు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మొత్తానికి సీమాంధ్రలో రాజీనామాల పర్వం కోనసాగుతుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy