సీసీ కెమెరాకు దండం: కొట్టేసిన పర్స్ తిరిగిచ్చేసిన దొంగ

సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఎలాంటి చిన్న పొరపాట్లు చేసిన వాళ్లయినా… ఇట్టే దొరికిపోతున్నారు. ఇక  దొంగతనాలు..ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకోవడానికి పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇందుకు ముంబైలో జరిగిన ఘటనే నిదర్శనం. ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌లో క్యూలో తన ముందున్న ఓ వ్యక్తి నుంచి అతని వ్యాలెట్ దొంగతనం చేశాడు ఓ దొంగ. పర్స్ చేతిలోపడగానే సంతోషంగా పక్కకి తిరిగి చూశాడు. అంతే షాక్ అయ్యాడు. ఎదురుగా సీసీ కెమెరా కన్పించడంతో…కెమెరాకు చిక్కానని తెలుసుకున్నాడు. దీంతో చేసేది ఏమీ లేక ఓక సారి కెమెరాకు దండం పెట్టాడు.

అంతే కాదు… మీ పర్స్ కిందపడిపోయిందంటూ తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చూడటానికి ఈ దొంగతనం కొంచెం వింతగా అనిపించినా… శిక్ష మాత్రం కఠినంగానే ఉంటుందని హెచ్చరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు… దొంగ వీడియోను ట్విట్టర్ లో ట్వీట్ చేయడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy