సుక్మా జిల్లాలో కాల్పులు: ముగ్గురు మావోల మృతి

Sukma encounterసుక్మా జిల్లాలోని చిత్రగుఫా ఏరియాలో శుక్రవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులు, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి.. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిత్రగుఫా ఏరియాలో మావోయిస్టులు పోలీసులకు ఎదురయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఘటనాస్థలి దగ్గర మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy