సునందా పుష్కర్ మృతి కేసు అప్ డేట్స్

shaahi

శశిథరూర్ భార్య సునందపుష్కర్ డెత్ మిస్టరీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కేంద్రమంత్రి థరూర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. సునంద పుష్కర్ మృతికి కారణాలు ఏమై ఉండొచ్చు? మరణానికి ముందు రోజుల్లో ఆమెకు, మీకు ఏమైనా గొడవలు జరిగాయా? పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్ తో మీకేంటి సంబంధం?  అని మేజిస్ట్రేట్.. శశి థరూర్ ను ప్రశ్నించారు. సునంద మరణానికి కొద్ది రోజుల ముందు నుంచీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ థరూర్ లిఖితపూర్వకంగా మెజిస్ట్రేట్ కు సమర్పించారు. జర్నలిస్ట్ నళినీ సింగ్ వాగ్మూలాన్ని కూడా మేజిస్ట్రేట్ నమోదు చేశారు. సునంద పుష్కర్ తన మొబైల్ నుంచి చివరిసారిగా నళినీ సింగ్ కు కాల్ చేశారు. మరోవైపు సునంద మరణంపై దర్యాప్తు వేగవంతం చేయాలని కేంద్ర హోంమంత్రి షిండేకు థరూర్ లేఖ రాశారు. భార్య మరణించిన విషాదంలో తానుంటే రకరకాలుగా వస్తున్న ఊహాగానాలు తనను భయపెడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తును త్వరగా పూర్తిచేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని షిండేకు విజ్ఞప్తి చేశారు.

సునంద పుష్కర్ కుట్రకు బలైందని పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ అన్నారు. శశి థరూర్, సునందల వివాహం వివాదస్పదంగా మారటానికి, తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె తెలిపారు. సునంద ఆరోగ్య సమస్యల గరించి రకరకాల కథనాలు ఉన్నాయని, తాను కేవలం రెండు సార్లే థరూర్ ను కలిసానని, ఏదిఏమైనా సునంద మరణం బాధాకరమని ఆవిడ అన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy