సునంద మృతి కేసు : ఆత్మహత్యకి ప్రేరేపించినట్లు చార్జిషీట్

shashi dharoor sunandaకాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి శశి ధరూర్ పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు ఫైల్ చేశారు. శశిధరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానామాస్పద మృతి కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో సెక్షన్ 306,  498Aకింద ఆయనపై పోలీసులు చార్జిషీటు ఫైల్ చేశారు. ఈ కేసు తదుపరి వాచారణను మే-24 కు కోర్టు వాయిదా వేసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం వంటి సెక్షన్ల కింద ఆయనపై కేసు పెట్టారు. పుష్కర్ ది హత్య కాదని.. ఆత్మహత్యేనని పటియాలా హౌస్ కోర్టుకు చెప్పారు పోలీసులు. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ 2014 జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్ లోని ఓ రూంలో విగతజీవిగా కనిపించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని మొదట చెప్పినా.. తర్వాత శశిథరూర్ హత్య చేయించారని కేసు నమోదైంది.

ఈ కేసు విచారణకు అప్పట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయితే..  సునందపుష్కర్ ను ఎవరూ హత్య చేయలేదని.. ఆమెది ఆత్మహత్యేనని కోర్టుకు తెలిపారు పోలీసులు. దానికి సంబంధించిన సెక్షన్ల కింద శశిథరూర్ పై ఛార్జి షీటు ఫైల్ చేశారు.

దీనిపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. ఈ కేసులోని అన్ని ఆధారాలను అప్పట్లో అధికారంలో ఉన్న UPA గవర్నమెంట్ నాశనం చేసిందన్నారు. విచారణ సమయంలో అధిక సమాచారం వస్తుందన్నారు. సునందాపుష్కర్ సూసైడ్ వ్యవహారంలో శశిధరూర్ హస్తమున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు స్వామి. తన భర్తకు.. ఓ పాకిస్ధాన్ జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందని సునందా పుష్కర్ బహిరంగంగా చెప్పిన కొన్ని రోజుల్లోనే.. జనవరి 17, 2014 సౌత్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అనుమానాస్పద స్ధితిలో ఆమె చనిపోయింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy