సునితది హత్యా? ఆత్మహత్యా?

Sunithaహైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా చనిపోయిన సునీత వ్యవహారం.. ఇంకా కొలిక్కి రాలేదు. ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న విషయం తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 4 రోజులు దాటిన తర్వాత కూడా సునీత మిస్టరీ గురించి వస్తున్న స్టోరీ ఇది

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర.. 5 రోజుల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన సునీత కేసులో పోలీసులు కీలక ఆధారాలు రాబడుతున్నారు. ఆమె రోజూ ఆఫీస్ కు ఎలా వెళ్లేది…? ఎవరితో స్నేహంగా ఉండేది…? చనిపోవడానికి ముందు ఎవరితో ఎక్కువగా మాట్లాడింది….? ఎవరితో చాట్ చేసింది…? కాల్ డేటాలో ఎవరి నంబర్లు ఉన్నాయి.. లాంటి వివరాలన్నీ తేలుస్తున్నారు. సునీతను రోజూ ఆమె అన్న నర్సింగరావు సికింద్రాబాద్ బస్టాప్ లో దింపేవాడనీ.. అక్కడి నుంచి అమీర్ పేటలో ఉన్న ఆఫీసుకు బస్సులో వెళ్లేదని పోలీసులు గుర్తించారు. కానీ చనిపోయిన రోజు ఉదయం.. డైరెక్ట్ గా ఆఫీస్ కు వెళ్లకుండా.. సునీత హైటెక్ సిటీకి వెళ్లిందని.. తర్వాత మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో ఉందనీ.. పోలీసులకు క్లూ అందింది.

సునీత సిమ్ కార్డు ఆధారంగా కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆమెతో కూకట్ పల్లికి చెందిన ఓ యువకుడు సన్నిహితంగా ఉంటున్నట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువకుడు.. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో టెలీకాలర్ గా పనిచేస్తున్నాడని.. సునీతకు, అతడితో కొంత కాలంగా స్నేహం ఉందనీ ఎంక్వైరీలో పోలీసులు తెలుసుకున్నారు. ఈ నెల 13 న పొద్దున 9 గంటలకు ఇద్దరూ కలుసుకున్నారని.. తర్వాత రోజు వాలెంటైన్స్ డే కావడంతో.. తన ప్రేమను అంగీకరించాలని సునీత అతడిని కోరిందని తెలుస్తోంది. ఇందుకు అంగీకరించకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని సునీత చెప్పినట్టు.. పోలీసులకు ఆ యువకుడు వివరించినట్టుగా సమాచారం.

సునీత్ సిమ్ కార్డ్ డేటా ప్రకారం.. తన స్నేహితుడితోనే ఎక్కువగా చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. సునీత నంబర్ ను ఆ యువకుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టాడనీ.. ఈ నెల 14, 15 తేదీల్లో సునీతను కలవకుండా ఉండేందుకు ప్రయత్నించాడనీ తెలుసుకున్నారు. అలాగే.. ఈ నెల 14న ఆఫీస్ కు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిన సునీత.. డైరెక్టర్ గా ఇస్నాపూర్ లోని ఓ ప్రార్థన మందిరంలో గంటపాటు ఉండి.. అక్కడి నుంచి హైటెక్ సిటీ వెళ్లినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సికింద్రాబాద్ లోని ఓ చర్చ్ దగ్గర కూడా.. తెల్లడి డబ్బా పట్టుకుని ఉన్న సునీత ఫూటేజ్ కూడా పోలీసులు గుర్తించారు. ఈ 2 ప్రాంతాల సీసీ టీవీ ఫుటేజ్ లలో ఉన్న సునీత దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన రోజు సునీత భాగ్యనగర్ సొసైటీకి ఎందుకు వెళ్లింది? ఎవరిని కలిసేందుకు వెళ్లింది? పోలీసుల అదుపులో ఉన్న యువకుడు సునీత మొబైల్ నంబర్ ను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు? సునీతకు ఎందుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు? తన ప్రేమను స్నేహితుడు అంగీకరించని కారణంగానే సునీత సూసైడ్ చేసుకుందా? అసలు సునీత మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా? లేక.. ఎవరైనా ఆమెను చంపేసి నిప్పు పెట్టి ఉంటారా? సునీత డెత్ సీక్రెట్ వెనక ఉన్న ఈ అనుమానాలన్నీ తీర్చే దిశగా పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy