సుప్రీంకెక్కిన కేజ్రీవాల్

kejriwalఢిల్లీ కేవలం కేంద్ర పాలిత ప్రాంతమని, లెఫ్టినెంట్ గవర్నరే సర్వాధికారి అని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో ఖంగు తిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్ట్ కెక్కుతున్నారు. హైకోర్టు తీర్పునుసవాల్ చేశారు. పాలనపారమైన అధికారాలన్నీ గవర్నర్ వద్దే ఉంటాయన్నది రాజ్యాంగ నియమమని, దీన్ని కేజ్రీవాల్ అతిక్రమించలేరని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం మంత్రులకు ఉండే అధికారాలను తోసిరాజనలేమని, హైకోర్టు తీర్పు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొనలేదని, అంచేత సుప్రీంను ఆశ్రయిస్తామని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కేజ్రీవాల్ ప్రస్తుతం మెడిటేషన్ నిమిత్తం ధర్మశాలలో ఉన్నారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలను అమలు పర్చకుండా మోడీ ప్రభుత్వం నాటకం ఆడిస్తోందని, తమను ఇరుకున పెట్టాలన్నది మోడీ ప్రయత్నమని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాజ్ జంగ్ కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డంగా కొట్టేయడంతో అసలు మా పరిధి ఏంటి, నిర్ణయాలు ఎందుకు తీసుకోకూడదు.. అని వివరణ కోరుతూ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు లో కేసు వేసింది. అక్కడ ప్రతికూలంగా తీర్పువచ్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy