‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రివ్యూ

24-1443088538-subramanyam-for-sale-review-679డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీతో ముందుకు వచ్చాడు. ఈమూవీకోసం ‘పిల్లా నువ్వులేని జీవితం’తో హిట్ పెయిర్ అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ – రెజీనా కసాండ్ర మరోసారి జతకట్టారు. ఇంతకీ ఈ మూవీ కథేంటి?  సినిమాను హరీష్ ఎలా తీర్చిదిద్దాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రివ్యూ.

 

 

 

 • సుబ్రమణ్యం (సాయి ధరమ్ తేజ్) డబ్బులు సంపాదించేందుకు  అమెరికాకు వెళ్లిపోతాడు. మనీ కోసం ఏపనైనా చేస్తుంటాడు.
 • ఈ క్రమంలో తనను తాను అమ్ముకోవడానికి కూడా రెడీ.
 • ఒక పెద్దింటి అమ్మాయి సీత (హీరోయిన్ రెజీనా) ఓ కుర్రాడిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి ఏకంగా అమెరికాకు చేరుకుంటుంది
 • తన ఫేస్ బుక్ ప్రేమికుడు పెద్ద రసికుడని, తనని నిలువునా మోసం చేశాడని తెలుకుంటుంది
 • అదే టైంలో ఆ అమ్మాయికి సుబ్రమణ్యం తో పరిచయం అవుతుంది
 • ఆమెకు సాయంగా ఉండి తాను పనిచేస్తున్న రెస్టారెంట్ లోనే జాబ్ ఇప్పిస్తాడు
 • డబ్బు అంటే పడిచచ్చిపోయే మన సుబ్రహ్మణ్యం ఆ అమ్మాయి తన భార్య అని చెప్పి ఒక కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తాడు
 • బెస్ట్ పెయిర్ గా నిలిచి ప్రైజ్ మనీ గెలుస్తాడు. ఇంతలో సీత చెల్లెలి పెళ్లి రావడంతో సుబ్రమణ్యం తన భర్తగా చెప్పి ఇండియాలోని తన ఇంటికి తీసుకొస్తుంది
 • దీంతో ఇక్కడ సుబ్రమణ్యంకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి అబద్దపు దంపతులు ఎలా ఒకటవుతారు అనేదే కథ
 • హీరో సాయి ధరమ్ తేజ్ తన యాక్టింగ్ ను చాలా బెటర్ చేసుకున్నాడు
 • కామెడీ ట్రాక్స్ హ్యాండిల్ చేయడంతోపాటు, డ్యాన్సులు ఇరగదీశాడు
 • అయితే ఎక్కువ సన్నివేశాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ ల బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యూలేషన్ లను ఇమిటేట్ చేయటంతో ఒరిజినాలిటీ మిస్ అయినట్టు అన్పించింది.
 • రేజీనా గ్లామర్, నటన కూడా ఓకే. నాగబాబు మాత్రం ఫ్రెష్ గా అనిపించాడు. రావు రమేష్ క్యారెక్టర్ రొటీన్ గా అనిపించింది
 • బ్రహ్మానందం పాత్రలో కూడా ఏమాత్రం కొత్తదనం లేదు. ప్రేక్షకులకు ఒక సందర్భంలో బోర్ అనిపిస్తాడు.
 • ఆదా శర్మ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఆదాశర్మ ముస్లిం కుర్రాడిని లవ్ చేసే సీన్ అస్సలు వర్కౌట్ కాలేదు
 • ఇక టెక్నికల్ అంశాలకు వస్తే, సినిమా నిర్మాణం చాలా క్వాలిటీగా జరిగింది
 • విజువల్స్ కేకపుట్టించాయి. ఫోటోగ్రఫీ సూపర్బ్. లొకేషన్స్ అదిరిపోయాయి. కాస్ట్యూమ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి
 • కథ పాతదే అయినా డైరెక్టర్  హరీష్ శంకర్ సినిమాని బోర్ కొట్టించకుండా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు
 • ఇక డ్రాబ్యాక్స్ విషయానికొస్తే…. బావగారు బాగున్నారా, మొగడు కావాలి మాత్రమే కాక అనేక పాత,కొత్త సినిమాల సీన్స్ కలబోసుకుని ఈ మెగా మేనల్లుడు సినిమా దిగింది
 • ప్రతీ సీన్ ఎక్కడో చూసినట్లు అనిపించటం ప్రత్యేకతగా దర్శకుడు కావాలని డిజైన్ చేసినట్లు ఉంటుంది
 • హీరోయిన్ కంటిన్యూగా చెప్పే డైలాగు కూడా ..’సీతతో అంత ఈజీ కాదు’… ఇంతకు ముందు ఎక్కడో విన్నట్లు ఉంటుంది
 • నాలుగైదు ప్లాష్ బ్యాక్ లు ఒకే కథలో వస్తున్నప్పుడే దర్శకుడు జాగ్రత్తపడి ఉండాల్సింది
 • ఏదైనా ఎక్కడా ఫ్రెష్ ఫీల్ అనేది లేని ఈ సినిమా హీరో అభిమానులుకు మాత్రం నచ్చేలా నాలుగు ఫైట్స్, ఆరు ఫైట్స్ తో ఫార్ములాతో వచ్చింది
 • డిస్కౌంట్ సేల్ కు ఇచ్చినా కూడా కష్టమే అనిపిస్తుంది సినీ లవర్స్ కు
 • దిల్ రాజు ఖర్చుకి వెనకాడకుండా అద్భుతమైన క్వాలిటీ సినిమానిచ్చాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy