సుమంత్ సినిమా : ఇదం జగత్ ఫస్ట్ లుక్

idam jagathఅనిల్ శ్రీకంఠ డైరెక్షన్ లో సుమంత్ హీరోగా నటిస్తున్న సినిమా ఇదం జగత్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను సోమవారం (జూన్-25) రిలీజ్ చేసింది యూనిట్. వెరైటీ క్యారెక్టర్లతో ఆకట్టుకునే సుమంత్ ఈ మూవీలోనూ డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. సుమంత్ సరసన అంజు కురియన్  హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు సినిమా విశేషాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. సుమంత్ కెరీర్‌ లో ఇప్పటి వరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని ట్విట్ చేశారు. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మూవీ తప్పకుండా నచ్చుతుందని.. త్వరలోనే సినిమా ఆడియో, విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy