సుశాంత్ సినిమా ఆడియో రిలీజ్ చేసిన అఖిల్

Aditya Music acquires Atadukundam Raకాళిదాసు, కరెంట్‌, అడ్డా… చిత్రాలతో ప్రేక్ష‌కాభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌.  స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా (జస్ట్‌ చిల్‌). అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనాగ్ కార్పొరేష‌న్, శ్రీజి ఫిలింస్ బ్యాన‌ర్స్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు,ఎ.నాగ సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ మ్యూజిక్ అందించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘ఆటాడుకుందాం…రా’ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ శిల్ప క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అక్కినేని అఖిల్ ముఖ్య అతిధిగా హాజ‌రై ఆటాడుకుందాం…రా ఆడియోను ఆవిష్క‌రించగా…ఆటాడుకుందాం…రా  ట్రైల‌ర్ ను హీరో సుమంత్ రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా…  హీరో  అఖిల్ మాట్లాడుతూ…మా ఫ్యామిలీ లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యుంటే అది అనూప్. చైత‌న్య‌కి నాకు ఒక  బ్ర‌ద‌ర్ లా వ‌ర్క్ చేస్తాడు. నాన్న‌కు త‌మ్ముడులా వ‌ర్క్ చేస్తాడు. మాకు మ‌నం ఇచ్చాడు. అది ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేం. సుశీల మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రికీ ఫేవ‌రేట్. సో..సుశీల‌మ్మ‌కి మా అంద‌రి స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇక‌ సుశాంత్ గురించి చెప్పాలంటే…సినిమాల త‌ప్ప వేరే ధ్యాసే ఉండ‌దు. ఆల్ ది బెస్ట్ సుశాంత్. నాన్న గారు ఈ ఫంక్ష‌న్ కి రావాలి అనుకున్నారు కానీ…అమితాబ్ గారితో ముంబాయిలో యాడ్ షూటింగ్ ఉండ‌డం వ‌ల‌న రాలేదు. ఈ షంక్ష‌న్ కి రాలేక‌పోయినందుకు సారీ చెప్ప‌మ‌న్నారు. మా ధైర్యం, బ‌లం అభిమానులే. ఇక నుంచి మ‌న సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. అభిమానులంద‌ర్నీ చూసిన త‌ర్వాత ఎన‌ర్జి వ‌చ్చింది. ఇక నేను చెల‌రేగిపోతాను అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ…చిన మావ‌య్య హిట్ కొడుతున్నాం అని చెప్పి మరీ సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో హిట్ కొట్టారు. చిన మావ‌య్య చెప్పిన‌ట్టుగా నేను చెప్ప‌లేను కానీ..ఈ సినిమా కచ్చితంగా స‌క్సెస్ అవుతుంది. ఈ సినిమాకి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది.  అమ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.  శ్రీనివాస్ అంకుల్  ఫ‌స్ట్ సినిమా నుంచి స‌పోర్ట్ చేస్తున్నారు.

డైరెక్ట‌ర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ… సుశాంత్ ప్ర‌తి సినిమాకి నెక్ట్స్ లెవెల్ కి వెళుతుంటారు. కాళిదాసు కంటే బెట‌ర్ క‌రెంట్, క‌రెంట్ కంటే బెట‌ర్ అడ్డా, ఇప్పుడు అడ్డా కంటే ఆటాడుకుందాం..రా బెట‌ర్ మూవీ అవుతుంది. అడ్డా టైమ్ లో సుశాంత్ మంచి ఫ్రెండ్ అయ్యారు. సుశాంత్ డెడికేష‌న్ తో వ‌ర్క్ చేస్తుంటారు. అయితే..సుశాంత్ లో న‌చ్చ‌ని విష‌యం ఏమిటంటే… మూడు సంవ‌త్స‌రాల‌కు ఒక‌ సినిమా చేయ‌డం. ఇక నుంచి సుశాంత్ సంవ‌త్స‌రానికి రెండు సినిమాలు చేయాలి అని కోరుతున్నాను. ఇక నిర్మాత చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గారు గురించి చెప్పాలంటే… టేస్ట్ తో పాటు గ‌ట్స్ ఉన్న ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. వ‌రుస‌గా ముగ్గురు ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసారు. మ‌న ఇండ‌స్ట్రీకి ఇలాంటి నిర్మాత ఉండ‌డం అదృష్టం.  సినిమా అన్ని ఏరియాల‌కు రీచ్ అయ్యేలా బాగా ప్ర‌మోష‌న్స్ చేస్తారు. ఇలాంటి నిర్మాత ఎప్పుడూ స‌క్సెస్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి టైమ్ న‌డుస్తుంది. క‌నుక ఈ సినిమా ఖ‌చ్చితంగా సెన్సేష‌న‌ల్ హిట్ అవుతుంది. అనూప్ మ్యూజిక్ యూత్ ని బాగా ఆక‌ట్టుకుంది. అనూప్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో కూడా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బ్రహ్మానందం, సుమంత్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్, జెమిని కిర‌ణ్‌, పృధ్వీ, శ్రీధ‌ర్ సీపాన‌, డైమండ్ ర‌త్నం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy