సుశాంత్ హీరోగా ‘చిll లll సౌll’

RAHULఅక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా బుధవారం(అక్టోబర్-11) అన్నపూర్ణ స్టూడియోలో ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నాడు. సుశాంత్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసిన రాహుల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, బుధవారం ఈ సినిమాను ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. వివాహ వేదిక మీద ఉన్న  చిll లll సౌll అనే అక్షరాలనే దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం మందిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy