సూపర్ ఆఫర్: ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఫ్రీ

 పోస్ట్ పెయిడ్,బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు వాడుతున్న కస్టమర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది బిఎస్ఎన్ఎల్. ఈ- కామర్స్ సైట్ అమెజాన్ తో కలిసి తన కస్టమర్లకు ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను అందిస్తోంది. రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ లేదా రూ.745 ఆ పైన విలువ గల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లను యూజ్ చేస్తున్న కస్టమర్లకు  ఈ ఆఫర్ వర్తిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను కస్టమర్లు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.  వెబ్ సైట్ లో కనిపించే అమెజాన్ ఆఫర్ బ్యానర్ పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ,సర్కిల్ ను ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపిని కన్ఫార్మ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ యాక్టివేట్ అవుతుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy